బ్రిటన్ రాజు ఛార్లెస్-3 ఆసుపత్రిలో చేరారు. 75ఏళ్ల కింగ్ ఛార్లెస్-3కి ప్రొస్టేట్‌గ్రంథి సమస్యతో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలస్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో డాక్టర్లు ఆయనకు ప్రొస్టేట్ గ్రంథికి సర్జరీ నిర్వహిస్తారని వెల్లడించింది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని పేర్కొంది. తన గురించి ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అంతకుముందురోజే వేల్స్ యువరాణి కేథరిన్ పొత్తికడుపు శస్త్రచికిత్స జరిగిందని ప్యాలస్ ప్రకటించింది. తాజాగా కేథరిన్‌కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే ఛార్లెస్-3 కూడా చేరినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది.
Also Read.. పుట్టగానే అమ్మేసిన తండ్రి.. 19 ఏళ్ల తర్వాత కలిసిన కవలలు
The post ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3. త్వరలో సర్జరీ? appeared first on tnewstelugu.com.
