ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం రామ మందిరంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసిన తర్వాత అయోధ్యను సందర్శించి శ్రీరాముడికి నమస్కరిస్తానాని తెలిపారు. తాజాగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 22 తర్వాత కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఇప్పటి వరకైతే ఆహ్వానం అందలేదని… కానీ కుటుంబంతో కలిసి వెళ్తానని అన్నారు.
“భద్రతా కారణాల దృష్ట్యా ఒక వ్యక్తిని మాత్రమే వేడుకకు అనుమతించినట్లు నాకు లేఖ వచ్చింది. వ్యక్తిగత ఆహ్వానం ఇచ్చేందుకు ఓ బృందం వస్తుందని చెప్పారు కానీ ఎవరూ రాలేదన్నారు. నేను నా భార్య మరియు పిల్లలతో కలిసి రామ్ లల్లా దర్శనానికి వెళ్లాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు కూడా రామ్ లల్లా దర్శనం కోసం తహతహలాడుతున్నారు. జనవరి 22న జరిగే వేడుక తర్వాత నేను నా భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులతో కలిసి వెళ్తాను” అని ఢిల్లీ ముఖ్యమంత్రి అయోధ్య రాముడి దర్శనంపై పిటిఐ వార్త పేర్కొంది.
