సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. దీనికి పోటీగా వచ్చిన హనుమాన్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావటంతో గుంటూరు కారానికి మరింత క్రేజ్ తగ్గింది. అయితే కంటెంట్ పరంగా బాగానే ఉన్నా.. కొన్ని ప్రమోషనల్ మిస్టేక్స్ కారణంగా కూడా మూవీ డౌన్ అయిందని తాజాగా చిత్ర నిర్మాత నాగ వంశీ వెల్లడించాడు. గుంటూరు కారం చిత్రాన్ని మొదటి ఆరు మిడ్ నైట్ షోస్ వేయటంతోనే టాక్ సరిగ్గా రాలేదని కొత్త విషయం చెప్పారు.
గుంటూరు కారం మూవీకి రాత్రి ఒంటిగంటకి మిడ్ నైట్ ప్రీమియర్ షోస్ హైదరాబాద్ తో పాటు చాలా పట్టణాలలో వేశారు. ఆ షోస్ కి ఎక్కువగా ఫ్యాన్స్, యూత్, లేడీస్, ఫ్యామిలీస్ వచ్చారు. ఆ టైంలో వీరి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దాంతో వీరి ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాకపోవటంతో వీరి ద్వారా అంతటా ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అయింది అని చెప్పారు. సలార్ పక్కా మాస్ మూవీ. అది మిడ్ నైట్ షో వేసిన ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ గుంటూరు కారం పక్కా ఫ్యామిలీ మూవీ. నిజానికి ఈ సినిమాకి మిడ్ నైట్ షో వేయకుండా ఉండాల్సింది అని అన్నారు నాగవంశీ.
