ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రముఖ వ్యాపార సంస్థ రియలన్స్ ఇండస్ట్రీస్ లో పలు విభాగాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించేందుకు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా పెట్రో కెమికల్ నుంచి న్యూ ఎనర్జీ వరకు రిలయన్స్ కు చెందిన పలు వ్యాపార విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొనే కంపెనీలు కొన్ని విద్యా సంస్థలకే పరిమితం అవుతున్నాయని..టాప్ 50 లేదా 100 సంస్థలు విద్యార్థులకే ఛాన్స్ ఇస్తున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ సమాన అవకాశాలు ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ రిక్రూట్ మెంట్ ను చేపట్టినట్లు పేర్కొంది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ 2024 పేరుతో ప్రారంభించిన ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో భాగంగా జనవరి 11 నుంచి జనవరి 19 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
కాగా ఇందులో బీటెక్, బీఈ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ ఆమోదం పొందిన విద్యాసంస్థల నుంచి కెమికల్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత వారు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ చేసిన విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఆన్ లైన్ అసెస్ మెంట్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. దానిలో సెలక్ట్ అయిన వారిని ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 వరకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారు. మార్చి నెలాఖరుకు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. పూర్తి వివరాల కోసం https://relianceget2024.in/ వెబ్ సైట్ ను చెక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: దళితబంధు పథకాన్ని కొనసాగించాలి..కలెక్టరేట్ ను ముట్టడించిన దళిత సంఘాలు..!!
The post ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్…రిలయన్స్ లో భారీగా ఉద్యోగాలు..ఇలా అప్లయ్ చేసుకోండి..!! appeared first on tnewstelugu.com.
