రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్ మెంట్ మండలం అనాజ్‌పూర్‌లోని ఓ బిల్డింగ్ లో ఇవాళ( ఆదివారం) గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ తర్వాత భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సిలిండర్ తో పాటు ఇంట్లో ఉన్న ఫ్రిజ్ కూడా పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఖానాపూర్ యువతి అలేఖ్య హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్
