దిల్లీ: ఫ్లైట్ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్ పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Also Read.. అది ఫేక్ వీడియో. మాస్టర్ బ్లాస్టర్ సీరియస్!
వివరాల్లోకి వెళితే.. దిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం పొగమంచు కారణంగా ఆలస్యం అయింది. ఇదే విషయాన్ని పైలట్ ప్రకటించాడు. ఇది విన్న ఓ ప్రయాణికుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. పైలట్ వద్దకు దూసుకువచ్చి దాడి చేశాడు. ఇండిగో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని విమానం నుంచి దించేసి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ విమానం 13 గంటల ఆలస్యంగా బయలుదేరింది.
Also Read.. 18 నుంచి ‘భారత్-ఇంగ్లండ్’ ఉప్పల్ టెస్టు మ్యాచ్ టిక్కెట్లు అమ్మకం
ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. దాంతో భారీ సంఖ్యలో విమానాలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం కూడా వందకు పైగా విమానాలు ఆలస్యంకాగా.. 79 రద్దయ్యాయి. ఈ పరిస్థితులతో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు.
