చెన్నై నుంచి ముంబైకి వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ రావడంతో కలకలం నెలకొంది. ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పూర్తివివరాల్లోకి వెళితే…ఇండిగో ఫ్లైట్ 6E-5188 చెన్నై నుంచి ముంబైకి వస్తోంది. విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉండగా, టాయిలెట్లో టిష్యూ పేపర్ దొరికిందని, దానిపై విమానంలో బాంబు ఉందని రాసి ఉంది.
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. విమానంలోని టాయిలెట్లో టిష్యూ పేపర్‌పై బెదిరింపు లేఖ కనిపించింది. టిష్యూ పేపర్‌పై ‘నా బ్యాగ్‌లో బాంబు ఉంది, బొంబాయిలో దిగితే అందరూ చనిపోతారు. నేను ఉగ్రవాద సంస్థకు చెందినవాడిని. ప్రతీకారం జరిగింది, అందరూ చనిపోతారు. ఇది విన్న ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు.
ఈ బెదిరింపు వచ్చిన తరువాత, స్థానిక పోలీసులు, ఇతర ఏజెన్సీలకు దాని గురించి సమాచారం అందించారు. విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే, ప్రయాణికులందరినీ హడావిడిగా డీబోర్డ్ చేసి విమానాన్ని తనిఖీ చేశారు. అయితే విమానం నుంచి ఎలాంటి అనుమానపు వస్తువు లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేసిన WFI..!!
