
హైదరాబాద్ : మణిపూర్ లోని ఇంఫాల్ విమానాశ్రయంలో విమానాల సంఖ్య పెరగడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది చేతులెత్తేశారు. ఎయిర్‌పోర్టు చిన్నదిగా ఉండడం, ఆందోళనల కారణంగా కొందరు సిబ్బంది సెలవులో ఉండడంతో సమస్య కనిపిస్తోంది.
ఈ కారణాల వల్ల తెలంగాణ పౌరులను సురక్షితంగా హైదరాబాద్‌కు చేర్చే ప్రక్రియ ఆలస్యమైంది. కాగా, సోమవారం ఉదయం 11 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ క్లియర్ అవుతుందని, తెలంగాణకు వెళ్లే ప్రత్యేక విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని మణిపూర్ అధికారులు తెలిపారు.
మరోవైపు మణిపూర్‌లోని ఎన్‌ఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఖమ్మం జిల్లా రాంనగర్‌తాండాకు చెందిన హర్షవర్ధన్ ఆదివారం ఢిల్లీకి చేరుకోగా తెలంగాణ భవన్ సిబ్బంది వచ్చి బస ఏర్పాటు చేశారు. వీరిని సోమవారం ఖమ్మం పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
