హైదరాబాద్: ‘ఫాస్టాగ్’ నిర్వహణపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. వాహనదారులు తమ బ్యాంకుల్లో ఫాస్టాగ్ లకు కేవైసీ సమర్పించకుంటే వాటిని డీయాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. ఈ నెల 31వ తేదీ తుది గడువుగా నిర్దేశించినట్లు వెల్లడించింది.
Also Read.. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు
అయితే, ‘ఫాస్టాగ్’ స్టేటస్ తెలుసుకునేందుకు ఫాస్టాగ్ వెబ్‌సైట్(https://fastag/ihml.com) లోకి వెళ్లి యూజర్ మొబైల్ నంబర్, పాస్ వర్డ్ లేదా ఓటీపీ నమోదు చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆపై డాష్ బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్ ఆప్షన్’ ఎంచుకుంటే.. కేవైసీ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. వెంటనే అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఫాస్టాగ్ కేవైసీని పూర్తి చేసుకోవాలని సూచించింది.
Also Read.. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా పాట్ కమిన్స్
అదే విధంగా ‘ఫాస్టాగ్’ స్టిక్కర్‌లను కొనుగోలు చేయడానికి వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ), తమ ఇంటి అడ్రస్, గుర్తింపు కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాలని సూచించింది. ఒక వాహనానికి ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్ లు.. ఒకే ఫాస్టాగ్ ను ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు వాడుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది.
