అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. చేసిన పనులే చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. చేసిన పనులే చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే మీకు గుర్తు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలన్నీ నెరవేరిస్తే మీకే మంచి పేరు వస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: టీమిండియాకు మరో స్టార్ బ్యాట్స్ మన్ దూరం
