ఇదేనా ప్రజాపాలన..?ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదన్నారు. ప్రతిపక్షాల గొంతు అనిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇదన్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు ?. ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు.
ఇది కూడ చదవండి:సీఎం భాష కు దీటుగా బదులు ఇవ్వగలం
The post ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం..కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం appeared first on tnewstelugu.com.
