మంచిర్యాల జిల్లా : కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలలో తెలంగాణను అగ్రగామిగా అభివృద్ధి చేశామని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. గెలుపు, ఓటమి కాకుండా ఎల్లవేళలా ప్రజల కోసం పనిచేస్తామన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో బొందపెడుతామని హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ దండ విఠల్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, మాజీ మంత్రి బోడ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే
The post ఇబ్బంది పెడితే.. కాంగ్రెస్ పార్టీని బొందపెడతాం appeared first on tnewstelugu.com.
