
హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 30వ తేదీ ఉదయం 6:30 గంటలకు పీఎస్ఎల్వీ సీ56 లిస్ట్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సింగపూర్‌కు చెందిన DS-SAR ఉపగ్రహంతో పాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది. చంద్రుని పరిశోధన కోసం ఇస్రో ఇటీవలే “చంద్రయాన్-3″ని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.
