శ్రీవారి కల్యాణోత్సవం సేవలో పాల్గొనాలని భక్తులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. స్వామివారి కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి తరించాలని కోరుకుంటారు. స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని చూసి పరవశించిపోవాలనుకుంటారు. శ్రీవారి కల్యాణోత్సవ సేవ టికెట్స్ పొందాలంటే ప్రముఖుల సిఫార్సు లేఖ అవసరమని భావిస్తుంటారు. ఎలాంటి సిఫార్సు లేకుండా సామాన్య భక్తుల కోసం టీటీడీ కల్యాణోత్సవ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మూడు నెలలకు ముందే కల్యాణోత్సవ సేవ టికెట్ బుకింగ్ చేసుకునే విధంగా టీటీడీ ప్రతినెలా కోటను రిలీజ్ చేస్తుంది. ఒక్కో జంటకు రూ. 1000 రుసుము చెల్లిస్తే కల్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇలా ప్రతినెల టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో ఈ టికెట్లను రిలీజ్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: అయోధ్యా రాముడి ప్రాణప్రతిష్ట నేడే..!!
http://ttdevasthanams.ap.gov.in అధికారిక వెబ్ సైట్ లో టీటీడీ కల్యాణోత్సవ టికెట్ల జారీ చేస్తుంది. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి టికెట్ కల్యాణోత్వ టికెట్ జారీ చేస్తారు. ఆన్ లైన్ లోకి లాగిన్ అయిన తర్వాత టికెట్ ను నమోదు చేసుకోవాలి. ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఈరోజు ఉదయం 10గంటలకు ఆర్జిత సేవ కోటను విడుదల చేస్తారు. అందులో కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలు ఉంటాయి.
