ఎంపీ సంతోష్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా, పచ్చదనం స్థాయి బాగా మెరుగుపడింది. ఈ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల నగరంలో ఈరోజు మొక్కలు నాటే మహోత్సవం ప్రారంభం కానుంది. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి అటవీ ప్రాంతంలో హరితహారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొంటారు. ఇదిలా ఉండగా… ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఫండ్ కింద మొక్కలు నాటే పథకానికి రూ.400 కోట్లు కేటాయించారు. మంత్రి పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది.
The post నేడు కొండగట్టులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారం appeared first on T News Telugu.
