ఈ నెల (ఫిబ్రవరి) 18వ తేదీ వరకు నుమాయిష్‌ను పొడిగిస్తున్నట్లు తెలిపింది హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ.షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15తో నుమాయిష్ ముగియనుంది. అయితే మరో 3 రోజులు అదనంగా పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. నుమాయిష్ గడువు దగ్గర పడుతున్నా ఇంకా రద్దీ ఏమాత్రం తగ్గకుండా..ఎక్కువ అవుతూనే ఉంది. నిన్న(ఆదివారం) సెలవు దినం కావడంతో నుమాయిష్ కు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. జనాల రద్దీ దృష్ట్యా గడువు పెంచినట్లు తెలిపింది ఎగ్జిబిషన్ సొసైటీ.
ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన నుమాయిష్ ప్రారంభమై..ఫిబ్రవరి 15వ తేదీ తో ముగుస్తుంది.
ఇది కూడా చదవండి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ వాయిదా
