
ఈ నెల 21 నుంచి 25 వరకు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య జయంతి మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్యుల ఎనిమిదో జయంతి ఉత్సవాల కరపత్రాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు. తొలిరోజు స్వామివారి ఊరేగింపుతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ వేదపండితులు భక్తులకు ప్రవచనాలు చేస్తారన్నారు.
