ఈ మధ్య వేసవిలో కురిసిన ఈ అకాల వర్షాలు అన్నదాతలు కష్టపడి పండించిన వరి పంటలను నాశనం చేశాయి. నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాలను వడగళ్ల వాన భయభ్రాంతులకు గురి చేసింది. అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి నష్టపోయిన రైతులను పరామర్శించాలని కేటీఆర్ ఆదేశించారు.
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. వర్షం వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా…రైతులకు సేవలందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు అండగా ఉండాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఈ రెండు రోజులు జాగ్రత్త… ఎమ్మెల్యేకు కేటీఆర్ ముఖ్య సూచనలు appeared first on T News Telugu.
