చాలా మంది చాయ్ తాగేందుకు ఇష్టపడుతుంటారు. పాలతో తయారు చేసిన చాయ్ రోజుకు 5 నుంచి 6సార్లు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు. పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం పాలటీని రోజుకు 5 నుంచి 6 సార్లు తాగుతే పెద్ద సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. టీలో పాలు కలపడం వల్ల అది ఆమ్లంగా మారుతుంది.
అందులో చక్కెరను జోడించడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ మిల్క్ టీ తాగితే..అది శరీరంలో అపానవాయువు లేదా ఉబ్బరం సమస్యను కలిగిస్తుందని చెబుతున్నారు. ఇది కడుపు జీర్ణక్రియలో పలు ఇబ్బందులను కలిగిస్తుంది. పొట్ట దీర్ఘకాలంలో దెబ్బతినడం ప్రారంభం అవుతుంది.
ఇది కూడా చదవండి: ఏమి ఆఫర్ భయ్యా..ఈ కార్లపై ఏకంగా లక్ష డిస్కౌంట్..!!
ఈ రకమైన చాయ్ ను ఏళ్ల తరబడి తాగినట్లయితే…శరీరంలో పోషకాహార లోపం జరుగుతుంది. ఈ చాయ్ ను ఎక్కువగా తాగడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. చాలా మంది నిద్రకోసం చాయ్ తాగుతుంటారు. కానీ ఈ చాయ్ ఒత్తిడి లేదా ఆందోళనను పెంచుతుంది. ఫలితం నిద్ర సమస్యలు కూడా మొదలవుతాయి. ఇవి నిద్రలేమి సమస్యకు కారణం అవుతాయి.
ఈ పాలతో తయారు చేసిన చాయ్ ను రోజు తప్పించి రోజు తాగితే మొటిమల ధోరణి బాగా పెరగుతుంది. ఎందుకంటే ఈ చాయ్ తాగడం వల్ల శరీరం ఆసిడిక్ గా మారుతుంది. ఫలితంగా నోటిలో పొక్కులు పెరుగుతాయి. చాలా మంది ఉదయాన్నే బాత్ రూమ్ కు వెళ్లేందుకు చాయ్ తాగుతారు. కానీ చాయ్ శరీరంలో మలబద్ధకం సమస్యను మరింతగా పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు టీ తాగకపోవడమే మంచిది.
ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్ పైశాచికత్వం..బడి పిల్లలకు స్నాక్స్ బంద్..!!
The post ఉదయం లేవగానే చాయ్ తాగుతున్నారా?అయితే భారీ నష్టం తప్పదు..!! appeared first on tnewstelugu.com.
