ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించి ఇవాళ(సోమవారం) తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. గ్రూప్ 1 సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచారు. అయితే యూనిఫామ్ సర్వీసులకు దీనిని నుంచి మినహాయింపునిచ్చింది.
ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటో తారీఖు గడిచి 11 రోజులవుతున్నా ఇప్పటికీ ఆ విషయమే చెప్పడం లేదు. మెగా డీఎస్సీ ఊసే ఎత్తడంలేదు. నోటిఫికేషన్లు ఆలస్యమవుతుందని కావచ్చు.. ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ను మరో రెండేండ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
