కేటీఆర్ అధ్యక్షతన నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ గారు పురపాలక మంత్రిగా ఉన్నప్ఫడు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందింది. బి ఆర్ ఎస్ పార్టీ పైన నాయకత్వం పైన ఇక్కడి ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు బి ఆర్ ఎస్ పార్టీకి ఉన్నాయి. మల్కాజగిరి సీట్ తప్పంసరిగా గెలుస్తాం. గతంలో మల్కాజగిరికి ఎంపీ గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏనాడు పట్టించుకోలేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీ కలిసి బి ఆర్ ఎస్ పార్టీ లేకుండా చేద్దాం అని వారి నాయుకులు బహిరంగంగా చెప్పడం చూస్తున్నము, వారి కుట్రలు మనకు అర్ధం అవుతుంది. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు అత్యధికంగా బి ఆర్ ఎస్ పార్టీ సాధిస్తుంది అని సర్వేలు చెప్పుతున్నాయ్. కేసీఆర్ గారి నాయకత్వం కోల్పోయినాము అని ప్రజలు బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సరిగ్గా లేదు, రాష్ట్రం పరువు తీసే విదముగా మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన హామీల గురించే ప్రస్థావిస్తున్నాం కొత్తగా ఏమి అడుగుతాలేము. హామీలును ఎప్పటి లోపల అమలు పరుస్తారు చెప్పాలి, ప్రజలను అయోమయంకు గురి చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఒక్క కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేద్దాం అని మా అధినేత కేసీఆర్ గారు చెప్పారు. తెలంగాణ వాయిస్ బి ఆర్ ఎస్ పార్టీ మాత్రమే అని అన్నారు వివేక్ గౌడ్.
