ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ తమ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలను చెల్లించింది. రుణాలు, వడ్డీల చెల్లింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సంస్థ..వేతనాలు చెల్లించేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చినట్లు సీఈవో రవీంద్రన్ స్వయంగా వెల్లడించారు. సోమవారం వరకు వేతనాలు అందుతాయని మీకు సమాచారం అందిందని తెలుసు. మీలో చాలా మంది నా పరిస్థితిని అర్థం చేసుకుని మరికొంతకాలమైనా వేచి ఉంటామని లేఖ రాశారు. కానీ సోమవారం వరకు ఎదురుచూడాల్సిన అవసరంలేదు.
వేతనాలు చెల్లించడానికి గత కొన్ని నెలలుగా నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. చట్టబద్దంగా అర్హత కలిగిన వేతనాన్ని మీరు వచ్చేలా చూసుకోవడానికి ఈసారి మరింత పోరాడాల్సి వచ్చింది. ప్రతిఒక్కరూ త్యాగాలు చేశారు. ఊహించని నిర్ణయాలు మీరు తీసుకున్నారు. ఈ యుద్ధంలో అందరూ ఎంతోకొంత అలసిపోయారు. కానీ ఎవరూ మధ్యలో నుంచి తప్పుకోలేదు. మనం నిర్మించుకున్న దానిపై మనకున్న నమ్మకమే దీనికి కారణం. ఆత్మగౌరవం ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఉద్యోగులకు రాసిన లేఖలో రవీంద్రన్ పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాల కోసం కంపెనీ దాదాపు రూ. 70కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో ఆ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు ..!!
The post ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వేతనాలు చెల్లించిన బైజూస్..!! appeared first on tnewstelugu.com.
