ఎమ్మెల్యే ముందే ఆశావర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో విషజ్వరాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఆశావర్కర్ తన బాధ్యతను నిర్విర్తించింది. కానీ ఈ మధ్యే విషజ్వరాలు ఎక్కువ అవ్వడంతో గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. విషజ్వరాలపై గ్రామస్తులతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా..ఆశావర్కర్ వెంకటలక్ష్మీ అక్కడికి వచ్చి బ్లేడుతో తన చేతిని కట్ చేసుకుంది.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ భాష మారదా? అదే భాష..అదే తీరు..!
ఈ హఠాత్తు పరిణామంతో ఎమ్మెల్యేతోపాటు అక్కడున్న అధికారులు, గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గ్రామానికి చెందిన కొందరు స్థానిక నేతలు తనను వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే ముందు వాపోయింది. స్థానిక కాంగ్రెస్ నేతల వేధింపులు తట్టుకోలేకే తనను గాయపర్చుకున్నట్లు చెప్పింది. వెంటనే అక్కడున్న మరో ఇద్దరు ఆశావర్కర్లు ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. పెద్ద గాయం కాకపోవడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. వెంకటలక్ష్మీని వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
