ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి షాక్ ఇచ్చింది. భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ భారీ జరిమానా విధించింది. ఎయిర్ ఇండియా ఉద్యోగి నుంచి అందిన ఫిర్యాదుతో డీజీసీఏ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ. 1 1 కోట్ల భారీ జరిమానా విధించింది.
నిర్దిష్ట సుదూర ప్రాంత క్లిష్టమైన మార్గాల్లో నిర్వహించే విమానాల విషయంలో ఎయిర్ ఇండియా సంస్థ భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆ సంస్థలోని ఓ ఉద్యోగి ఫిర్యాదు అందించినట్లు డీజీసీఏ తెలిపింది. ఆ ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది. దీనికి సంబంధించి సంస్థకు భారీ జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: నకిలీ నోట్లతో మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్ట్
