ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో జరిగిన డెవలప్ గురించి గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని..సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు 4బడ్జెట్లు ప్రవేశపెట్టిందని.. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్ధికంగా లబ్ధిపొందారని గవర్నర్ ప్రసంగించారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. ఏపీలో మానవాభివృద్ధికి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించామన్నారు. పేదపిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: ఇల్లందులో పొలిటికల్ హై టెన్షన్.. మున్సిపాలిటీ అవిశ్వాసంలో హైడ్రామా!!
