హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ ప్రజలను మోడీ సర్కార్ మళ్లీ మోసం చేసింది. వేలాది మంది విశాఖ ఉక్కు కార్మికులను, వందలాది కుటుంబాలను రోడ్డున పడేయాలని బీజేపీ పన్నాగం పన్నుతోంది. అప్పుడు తెలంగాణ ఏర్పాటు గురించి… ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం సెంటిమెంట్ తో ఆడుకుంటోందన్నారు. కార్యకర్తలు, మేధావులు ఊహించినట్లుగానే ప్రైవేటీకరణపై బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి బయటపడింది.
బీఆర్‌ఎస్ వల్ల కాదని కేంద్రం తమ వల్లే వెనక్కి తగ్గిందని, ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జగన్ విజ్ఞప్తిని బీజేపీ వదులుకోవడంతో ఏపీ మంత్రులు ఎక్కడ తలలు పెడతారని ఏపీ యువత, మేధావులు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ ప్రజలు, విద్యార్థులు, యువత తదుపరి దశ పోరాటానికి సమాయత్తం కావాలని, ఏపీకి చెందిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడంలో బీఆర్‌ఎస్ పార్టీ మరింత చొరవ చూపాలని కోరుతున్నారు. కార్మికుల పోరాటాలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఏపీలో పెరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. మలిదశ ఉద్యమంలో అధికార పార్టీ ముసుగును విప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఏపీ యువత విద్యార్థులు, మేధావులపై ఉంది.
