హైదరాబాద్: ఏ గాలి కూడా హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలువును అడ్డుకోలేకపోయిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె .కేశవ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని అభినందించారు. మంత్రిగా కేటీఆర్ చేసిన కృషికి రాజధాని ఓటర్లు మద్దతుగా నిలిచారని తెలిపారు. శనివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజక వర్గాల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Also Read.. ఉప్పల్లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్: సైనికులకు, విద్యార్థులకు ఫ్రీ
‘‘కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించాం. వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు హీరోలు. బీఆర్ఎస్ లో యువతను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తాం. ప్రతి మూడు నెలల కోసారి పార్టీ మీటింగ్ లు మండల స్థాయి నుంచి ఏర్పాటు చేసుకుందాం. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్ పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించి పార్టీ పునర్వ్యవస్థీకరణపై నిర్ణయాలు ప్రకటిస్తారు.’’ అని ఆయన పేర్కొన్నారు.
The post ఏ గాలి హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలువును అడ్డుకోలేకపోయింది appeared first on tnewstelugu.com.
