అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఈరోజు ఐరాస మాజీ రాయబారి, సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీతో సమావేశమయ్యారు. అమెరికా-భారత్ సంబంధాల నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యతపై మంత్రి కేటీఆర్ హెలీతో మాట్లాడారు. ఆర్థిక, ఎన్నికల, రాజకీయ అంశాలపై నిక్కీ హేలీతో విస్తృతంగా అభిప్రాయాలు పంచుకున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొననున్న నేపథ్యంలో నిక్కీకి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిక్కీ హెలీతో దిగిన ఫొటోను కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మరియు @నిక్కీహేలీ ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి మరియు సౌత్ కరోలినా గవర్నర్
అమెరికా-భారత్ సంబంధాల విస్తృత సందర్భంలో హైదరాబాద్ మరియు తెలంగాణల వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఆమెకు వివరించారు
ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలపై కూడా చర్చించి అభిప్రాయాలను పంచుకున్నారు… pic.twitter.com/PDyxnbwu3b
— కేటీఆర్ (@KTRBRS) మే 23, 2023
