భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్‌పై సీబీఐ అధికారులు ఐటీ దాడులు నిర్వహించారు. పైళ్ల శేఖర్ రెడ్డిని ఉద్దేశించి దాడులు చేశారని అన్నారు. ఐటీ దాడుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “గత మూడు రోజుల నుంచి నాపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నాపై వచ్చిన ఆరోపణల్లో చాలా అవాస్తవం.. ఐటీ రైడ్ మొదటి రోజు గంటన్నరలో జరిగి 3 రోజులు పట్టింది. నాకు మైనింగ్ వ్యాపారం అవాస్తవం. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాను.. నాపై కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ ఐటీ దాడులు.. బీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఈ దాడులు చేస్తోంది.. నేను 1998 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను.. నాకు మైనింగ్ వ్యాపారం లేదు.. ఐటీ అధికారులకు సరైన సమాచారం రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.అధికారులు నాకు నోటీసులిచ్చారు. విచారణలో భాగంగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.. ఈ మూడు రోజులుగా నాకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు’’ అని ఎమ్మెల్యే పైల అన్నారు. .
The post పరువు నష్టం కోసం నాపై ఐటీ దాడులు appeared first on T News Telugu.
