కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలోని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీదేనన్నారు.
కాంగ్రెస్ నాయకులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారని అన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టిపెట్టకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, కేసీఆర్‌పై ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారన్నారు. విజన చట్టాన్ని తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో పంటల సాగు తగ్గిందని.. నీటిని కోసం, కరెంట్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయన్నారు. చేజారిన ఏడు అసెంబ్లీ స్థానాలు కాపాడుకోవాలంటే పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని బీఆర్‌ఎస్ కైవసం చేసుకోవాలన్నారు. ఇందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: 2028లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది
