ఈరోజు జరిగిన IPL 2023 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 పాయింట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది. మనీష్ పాండే (50) ఒంటరి పోరాటం చేసినా.. ఆఖర్లో అమన్ ఖాన్ (18) విఫలయత్నం చేశాడు. అలాగే ఢిల్లీ ఐదోసారి ఓడిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 174 పరుగులు చేయగా, విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. డుప్లెసిస్(22), మ్యాక్స్‌వెల్(24)లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీశారు. 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ ప్రధాన బ్యాట్స్ మెన్ పృథ్వీ షా (0), మిచెల్ మార్ష్ (0), యశ్ ధుల్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (19) కూడా పేలవ ప్రదర్శన చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో విజయ్ కుమార్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు.
