టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ నుంచి ఓ కీలక వార్త వెలువడింది. రంజీ ట్రోఫీలో కర్నాటక క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న మయాంక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. విమానంలో అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా అనారోగ్యం పాలయ్యారు. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్ విపరీతమైన గొంతునొప్పి, మంటతో బాధపడినట్లు సమాచారం. తీవ్రవాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ అవ్వకముందే ఈ ప్రమాదం జరగడంతో అతడిని హుటాహుటినా అగర్తలలోని ఐఎస్ఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. విమానంలో మయాంక్ కు ఇలా ఎందుకు జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. కాగా మయాంక్ జనవరి 26 నుండి జనవరి 29 వరకు కర్ణాటక జట్టు త్రిపురతో అగర్తలాలో రంజీ మ్యాచ్ ఆడారు.
త్రిపురపై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు :
త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలో కర్ణాటక 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ 100 బంతుల్లో 51 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 10 ఫోర్లు బాదాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ 19 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 3 ఫోర్లు కొట్టాడు.
టీమ్ ఇండియాలో ఇప్పటివరకు ప్రదర్శన:
మయాంక్ అగర్వాల్ ఇప్పటి వరకు టీమిండియా తరపున మొత్తం 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ఈ టెస్టు మ్యాచ్‌ల్లో 41.33 సగటుతో 1488 పరుగులు చేశాడు. అతను ఇప్పటివరకు 5 అర్ధ సెంచరీలు, 4 సెంచరీలు కూడా చేశాడు. అదే సమయంలో, అతను వన్డేల్లో 17.2 సగటుతో 86 పరుగులు మాత్రమే చేశాడు. కానీ 2022 మార్చి నుంచి అతనికి టీమ్ ఇండియాకు ఆడే అవకాశం రాలేదు.
The post ఐసీయూలో క్రికెటర్ మయాంక్ అగర్వాల్..హానికర ద్రవం తాగిన మయాంక్..!! appeared first on tnewstelugu.com.
