బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇది పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది. దేశం మొత్తం గణతంత్ర వేడుకలు జరుపుకుంటోంది. తెలంగాణలోనూ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా అవిష్కరించి రిపబ్లిక్ డే నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు 👇 pic.twitter.com/G1Xl7AEeHt
— KTR (@KTRBRS) January 26, 2024
కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ సుమతి శతకానికి సంబంధించిన పోస్టు చేశారు. దానికి పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్టులో ‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి ’ అనే పద్యం ఉంది. అయితే ఈ ట్వీట్ ఎవరి ఉద్దేశించి చేశారని నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ పై రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: చిరంజీవి గురించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే..!!
