యువ కన్నడ సినీ నటుడు నితిన్ గోపి గుండెపోటుతో మరణించారు. అప్పటికి అతని వయస్సు 39 సంవత్సరాలు. నితిన్ మృతితో శాండల్‌వుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నితిన్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చివరకు మృతి చెందాడు. నితిన్ అకాల మరణం పట్ల కన్నడ సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
నితిన్ ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. నితిన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాడు. ముత్తినంట హమేంటి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబాండవ్య మొదలైన సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. నితిన్ భక్తిరస సిరీస్ “హర హర మహాదేవ్” యొక్క అనేక ఎపిసోడ్లలో కూడా నటించాడు. అలాగే… కొన్ని తమిళ సీరియల్స్ లో కూడా నటించాడు.
