జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ధనుర్మాస వ్రత సమాప్తం, భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ గోదాదేవి అమ్మవారి కల్యాణం నిర్వహించారు. పట్టణంలోని ప్రజలు, భక్తులు అమ్మవారి కల్యాణ వేడుకలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కల్యాణ వేడుకలో భూపాలపల్లి మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, వారి సతీమణి గండ్ర జ్యోతి, కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర దంపతులు భక్తులకు అన్నదానం చేశారు.
Also Read.. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
The post కన్నుల పండగగా శ్రీగోదాదేవి అమ్మవారి కళ్యాణం appeared first on tnewstelugu.com.
