కరెంటు, తాగునీరు, సాగునీరు ఇవ్వని వారికి మళ్లీ ఓటేయడానికి వచ్చారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి మూసాపేట మండలం వేముల గ్రామంలో రూ.500 కోట్లతో ఎస్ జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ ఏర్పడిన తర్వాత దేవరకద్రలో 40 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతుందన్నారు. 2023లో 98 వేలకు సాగునీరు అందిస్తామన్నారు. దేవరకద్రలో అద్భుతమైన చెక్‌డ్యామ్‌లు నిర్మించామన్నారు. అలాగే కరివెన పూర్తయితే లక్ష ఎకరాలకు 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్తకోట, దేవరకద్రలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. కరెంటు, తాగునీరు, సాగునీరు ఇవ్వని వాళ్లు మళ్లీ ఓటేయడానికి వచ్చారని… మళ్లీ అబద్ధాలు చెప్పి ప్రజల్లోకి వచ్చారని మంత్రి అన్నారు. లైఫ్ సైన్స్‌లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు.
మంత్రి మలరేడి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇంకా నీళ్లు, కరెంటు ఇవ్వలేదన్నారు. గతంలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
The post కరెంటు, తాగునీరు, సాగునీరు లేని వారు మళ్లీ ఓటు వేయడానికి వచ్చారు appeared first on T News Telugu.
