దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల, దేశవ్యాప్తంగా ధృవీకరించబడిన కేసుల రోజువారీ సగటు సంఖ్య 11,000 దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 11,109 కోవిడ్-పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 29 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 49,622కి చేరుకుంది. కోవిడ్ పరీక్షల పాజిటివ్ రేటు 5.01 శాతానికి చేరుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఏపీలోని కోనసీమ జిల్లాలో కూడా 20 కేసులు నమోదయ్యాయి. పౌరులు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం మంచిదని ఆరోగ్య శాఖ తెలిపింది
