కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై కేసు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు పోలీసులను ఆదేశించింది. బీజేపీ నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు డీకే శివకుమార్ తోపాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐటీ సెల్ హెడ్ బీఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆందోళనలో పాల్గొన్న కరసేవక్ శ్రీకాంత్ పూజారిని పోలీసులు ఈమధ్యే అరెస్టు చేసినందుకు నిరసనగా బీజేపీ నిరసన చేపట్టింది. దీనిలో భాగంగా ఆందోళనకారులు నేను కూడా కరసేవక్ నే నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
ఇది కూడా చదవండి: ఆఫీసుకు రావాల్సిందే..లేదంటే చర్యలు తప్పవు..ఉద్యోగులకు టీసీఎస్ అల్టీమేటం!
అయితే ఈ ప్లకార్డులను కాంగ్రెస్ మరో రకంగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మోసాలు, ఇతర అక్రమాలు మేమే చేశాం అనే అర్ధం వచ్చే విధంగా మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ ఐటీ సెల్ పోస్టు చేసింది. ఇదే పోస్టులను డీకే శివకుమార్ తన సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. దీంతో బీజేపీ ఫైర్ అయ్యింది. బీజేపీ నాయకులను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ నేతలు మార్చారని పేర్కొంటూ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది బీజేపీ లీగల్ సెల్. దీంతో చిత్రాన్ని మార్ఫింగ్ చేసినవారిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటం
