జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైనిక సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పూంచ్ జిల్లాలోని సరిహద్దులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని మిలటరీ అధికారులు తెలిపారు.
అనుకూల వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న సైన్యం.. ఉగ్రవాదులు భారత సరిహద్దు దాటుతుండగా వారిపై కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఒక సైనికుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు.
