నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్రలో కాంగ్రెస్‌లో వర్గపోరు బట్టబయలైంది. చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
దేవరకొండ కాంగ్రెస్‌లో నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బట్టీ పోరులో పాల్గొన్న నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ నేతలు రవినాయక్, కిషన్‌నాయక్ మధ్య వర్గపోరు కొనసాగుతోంది.
