పేగులు తెగిపోయే దాకా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దన్నారు మాజీ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి. జనగామలోని ఉషోదయ ఫంక్షన్ హాల్ లో జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్లొని మాట్లాడిన ఆయన..రాష్ట్రం లో 33 జిల్లాలు ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన చేరువ చేశారు. కేసీఆర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేశారు. ఒకనాడు బుక్కెడు బువ్వకు నోచుకోని తెలంగాణ ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన అతి తక్కువ సమయంలోనే ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి వ్యతిరేకత పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము గోదావారి జలాలతో చెరువులు ఎలా నింపామో అలా అన్ని చెరువులు నింపి చూపించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రద్ద పెట్టాలి.. కానీ పనికిమాలిన అంశాలపై కాదన్నారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలమంతా కలిసికట్టుగా పని చేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: నల్లగొండలో బీఆర్‌ఎస్ సభకు అనుమతినిచ్చిన ఎస్పీ
