హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ దాహం ఒక హత్యతో తీరేలా కనిపించడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెర తీసింది. మంత్రిగా జూపల్లి నియంత్రించాలని అని మాత్రమే కేటీఆర్ అన్నారు తప్ప, ఎలాంటి ఆరోపణలు చేయలేదు. జూపల్లి ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ అనవసర ఆరోపణలు చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జూపల్లి లేనిపోని అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకురావడం సబబు కాదని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
The post కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది appeared first on tnewstelugu.com.
