గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్దాలు ప్రచారం చేసి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలిచింది అని అన్నారు హరీష్ రావు. నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ.. ‘ghmc ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు నిరూపించారు. ఇపుడు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా భిన్నంగా ఉంటాయి.
కీలకమైన పార్లమెంటు ఎన్నికల్లో మీరు కష్టపడి పని చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో కొనసాగి మళ్ళీ అధికారంలోకి రావడం అరుదు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో ఐదేళ్లకే కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. కొన్ని చిన్న చిన్న కారణాలతోనే బీ ఆర్ ఎస్ ఓడిపోయింది. కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేస్తాం. కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు అయ్యాయి. ఆ రెండు పార్టీల డ్రామాలు ఎండగట్టి పార్లమెంటు ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ను గెలిపించేందుకు కార్యకర్తలు ఇప్పట్నుంచే నడుం బిగించాలి
The post కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయి.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ appeared first on tnewstelugu.com.
