రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మనందరికి తెలుసు.. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం లో కాకతీయ తోరణం, చార్మినార్ ఈ రెండు తొలిగించాలని కాబినెట్ లో చర్చిస్తున్నాం అని చెప్పారన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కాకతీయలో వరంగల్ నగరాన్ని రాజధానిగా చేసుకొని వందల ఏళ్లు దక్షణ భారత దేశాన్ని పరిపాలించారని తెలిపారు.వారు పరిపాలన చేసిన సమయంలో ప్రతి గ్రామంలో రెండు, మూడు కుంటలు ఒక్క పెద్ద చెరువు ఏర్పాటు చేశారు. వ్యవసాయం పైన ఎక్కువు దృష్టి సారించారు. రాజాభోగాలు అనుభవించిన వంశం కాదు కాకతీయలు. పేద ప్రజల కోసం పని చేశారు. 44వేల చెరువులు నిర్మించారు. ఆ కాలంలో మన దురుదృష్టం వలన ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్లక్ష్యం చేస్తే..అందుకే మిషన్ కాకతీయ పేరు మీద పథకం తీసుకొచ్చి 2014లో చెరువులును కేసీఆర్ పునరోద్ధించారు. కాకతీయులు ఓ కులానికో చెందిన వారు కాదన్నారు.
చార్మినార్ ఓ చారిత్రక కట్టడం..రేవంత్ రెడ్డి పైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను మరిపించడానికి చేస్తున్న కుట్ర గా కనిపిస్తోందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. మన మూడు రంగులు జెండాలో ఉన్నది అశోక్ చక్రం. అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వారు కాదు. టీజీ అంటే ఎక్కడిదో అనుకుంటారాని. టీఎస్ తెలంగాణ స్టేట్ అని అర్ధం, తెలంగాణ రాష్ట్రమని అర్థమన్నారు. దీనిపై వెంటనే మీ నిర్ణయం విరమించుకోవాలన్నారు. ఇంకా ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోవడాన్ని కొన్ని వర్గాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు.
ఇది కూడా చదవండి:రాష్ట్రంలో భారీగా ఎంపీడీవోల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
