
వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. హనుమకొండ కాంగ్రెస్ వర్గపోరు తారాస్థాయికి చేరింది. జనగామ డీసీసీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హనుమకొండ డీసీసీ చైర్మన్ నాయిని రాజేందర్ రెడ్డిల మధ్య వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. జనగామ డీసీసీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు హనుమకొండ డీసీసీ చైర్మన్ నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా సస్పెన్షన్‌కు సంబంధించిన నిర్ణయ లేఖను కూడా పీసీసీకి పంపుతున్నట్లు రాజేందర్ రెడ్డి తెలిపారు. జంగా రాఘవరెడ్డి సస్పెన్షన్‌కు పార్టీ అంగీకరించకపోతే రాజేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. గతంలో ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని నాయిని రాజేందర్ రెడ్డి వాపోయారు.
