సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులో ఆగి ఉన్న కార్మికుల ఆటోలను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న గుల్జార్, ఫిరోజర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వేగంగా వచ్చిన ట్రక్కు కారును ఢీకొనడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న కిరాణా దుకాణంలోకి దూసుకెళ్లింది. కిరాణా దుకాణాలు మొత్తం ధ్వంసమయ్యాయి. ఘటన సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు డ్రైవర్‌ను చితకబాదారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారంతా బీహార్‌కు చెందిన వలస కార్మికులే కావడం గమనార్హం.
