
నల్గొండ జిల్లా: వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న కారును డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిరియా లగోడా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని నేరేడుచర్ల మండలం ముకుందాపురంకు చెందిన మధులోత(18)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
