అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ మాటెయోలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అలమెడ లాస్ పులగాస్ అనే ప్రాంతంలోని బ్లాక్ నంబర్ 4100లో ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన ఆనంద్ సుజాత్ హెన్రీ (42), భార్య అలిస్ బెంజిగర్ (40), నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ మరణాలకు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వెల్ఫేర్ చెక్ సమయంలో ఈ ఇంటి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఆ ఇంటిలోకి వెళ్లే అన్ని తలుపులు మూసే ఉన్నాయి. కానీ, ఒక కిటికీ తెరిచి ఉండటంతో అధికారులు అందులో నుంచి లోపలకు వెళ్లారు. అధికారులకు బాత్‌రూమ్‌లో దంపతుల మృతదేహాలు కనిపించాయి. వీరి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలున్నాయి. సమీపంలో ఒక 9ఎంఎం తుపాకీ, తూటాలను స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు
