పాలకుర్తి నియోజకవర్గ బృందవన్ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు జాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఎర్రబెల్లి ట్రస్ట్ నుండి ఎన్నో పనులు చేసాం.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించి.. వెయ్యి మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాము. పాలకుర్తిలో ఇరవై వేల మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించము. కరోనా సమయంలో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరిని కంటికి రెప్పలా కపాడుకున్నాం. పాలకుర్తి నియోజవర్గంలో వికలాంగులకు త్రీ వీలర్ బైకులు ఇచ్చాను. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎడారి అయ్యేది. పాలకుర్తిని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాను’ అని అన్నారు ఎర్రబెల్లి.
