గృహజ్యోతి పథకంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. 200యూనిట్లలోపు ఫ్రీకరెంట్ ఇస్తామన్న సర్కార్..ఆహార భద్రత, ఆధార్ కార్డు ఉంటేనే ఫ్రీ కరెంటు అంటూ మెలిక పెట్టింది. దీంతో రేషన్ కార్డులేనివారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గృహజ్యోతి పథకం కోసం హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాటికి 10లక్షల మంది వినియోగదారుల నుంచి ఆహారభద్రత, ఆధార్ కార్డు వివరాలను సేకరించడం పూర్తయ్యింది.
ఈనెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల కారణంగా వివరాల సేకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. బిల్లింగ్ తోపాటు వీటినిసేకరించాలని ప్రయత్నించినప్పటికీ ఆలస్యం అవ్వడంతో మొదట బిల్లింగ్ ప్రక్రియ డిస్కం పూర్తి చేసింది. మిగిలినవారి వివరాల సేకరణపై యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఇవి కూడా పూర్తి అయితే మరో 5లక్షల మందికి లబ్ది చేకూరే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
పాతబస్తీ,శివారు ప్రాంతం కలిసి ఉండే రాజేంద్రనగ్ర సర్కిల్ లోనే నగరంలో అత్యధికంగా 30శాతం వినియోగదారులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ వివరాలను సమర్పించారు. సైబర్ సిటీ సర్కిల్ లో అత్యల్పంగా 17శాతం మంది వివరాలు ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ లో 18శాతానికి మించలేదు. శివార్లలోని సర్కిళ్లలోనూ 23శాతం మించలేదు. సిబ్బంది వెళ్లినప్పుడు ఇళ్ల దగ్గర దరఖాస్తుదారులు లేకపోవడంతో అనుసంధాన ప్రక్రియ జిల్లాలతోపోలిస్తే నగరంలో తక్కువగా నమోదు అయ్యింది. మొత్తం గృహజ్యోతి విద్యుతు కనెక్షన్లు 48లక్షలు ఉండగా 21 శాతం మాత్రమే అనుసంధానం అయ్యాయి. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుదారులందరి నుంచి వివరాలు సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు.
కాగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 19.85లక్షల దరఖాస్తుల్లో మిగిలిన 9లక్షల మంది దాకా వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఇక్కడే క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బందికి భిన్నమైన అనుభాలెన్నో ఎదురయ్యాయి. తమ ఇంట్లో విద్యుత్ కనెక్షన్లు అద్దుకుండేవారి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ను అనుసంధానం చేయడం కొందరు ఇంటి యజమానులు అంగీకరించడం లేదని సిబ్బంది అంటున్నారు. అద్దెకు ఉండే వారు ఎందుకు వద్దని వాదిస్తే ఇళ్లు ఖాళీ చేయాలని చెబుతున్నారు. దీంతో వీరి దగ్గర ఆహార భద్రత కార్డు ఉన్నా అనుసంధానం కావడం లేదని చెబుతున్నారు.
ఒక ఇంట్లో మూడు కుటుంబాలు ఉండి..ముగ్గురికి రేషన్ కార్డు ఉండి మీటర్ ఒక్కటే ఉంటే ఒక్కదానికే అనుసంధానం అవుతుంది. జిల్లాలో నుంచి వచ్చినవారు ఇక్కడ అద్దెకు ఉంటున్నారు. తమ సొంతఊర్లలో అనుసంధానం చేయించుకోవడంతో ఇక్కడ చేయించుకోలేకపోతున్నారు.
ఇది కూడా చదవండి: నేడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ పుట్టినరోజు…ఘనంగా సంబురాలు..!!
The post కిరాయి ఇళ్లలో కిరికిరి పెట్టిన గృహజ్యోతి..!! appeared first on tnewstelugu.com.
